
అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలకు వివరిస్తాం: డీకే అరుణ
AP: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 13 నుండి 25 వరకు భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా శనివారం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన విజయవాడలో జరిగిన కార్యశాల కార్యక్రమానికి డీకే అరుణ హాజరై మాట్లాడారు. అంబేద్కర్ జయంతి వేడుకలను గ్రామగ్రామాన ఘనంగా నిర్వహిస్తామని, ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని మేం ప్రజలకు వివరిస్తామని ఆమె పేర్కొన్నారు.