నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా బతుకమ్మ పాటలకు విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. ఆడపడుచుల పెద్ద పండుగ బతుకమ్మ అని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ, మార్కెట్ ఛైర్మెన్ సదాశివారెడ్డి పాల్గొన్నారు.