నారాయణపేట జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన సేవలాల్ క్రికెట్ పోటీలను మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కాసేపు సరదాగా క్రికెట్ అడి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. క్రికెట్ లో రాణించాలని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివరెడ్డి గారు, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు.