వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

77చూసినవారు
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాద్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్ నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాలోని హెడ్మాస్టర్లతో సమావేశం నిర్వహించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుండి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. డిసెంబర్ లోపు సిలబస్ పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్