నారాయణపేట మండలం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న యంగ్ ఇండియా సమ్మర్ క్యాంపులో గురువారం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన, చిత్రలేఖనం నిర్వహించినట్లు హెడ్మాస్టర్ భారతి తెలిపారు. విద్యార్థులు కాగితాలతో వివిధ రకాల ఆకృతులు తయారు చేసి ఆకట్టుకున్నారు. బ్యాంకు ఖాతా ఎటిఎం, ఓటిపి వివరాలను అపరిచితులకు చెప్పకూడదని చెప్పారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.