వరి ధాన్యం కొనుగోళ్లపై గురువారం నారాయణపేట కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష జరిపారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, ఇంకా ఎన్ని కేంద్రాలను ప్రారంభించాల్సి ఉందని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించాలన్నారు. సన్న రకం ధాన్యం సేకరణలో అధికారులు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని సూచించారు.