దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నారాయణపేట పట్టణంలోని పలు ఆలయాల్లో దుర్గామాత పూజల్లో ఎంపి డికే అరుణ పాల్గొన్నారు. వాసవి కన్యకాపరమేశ్వరి, గజలేశ్వరి ఆలయాల్లో అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు, హారతులు చేశారు. ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. పట్టణంలో నియమనిష్ఠలతో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయని ఎంపి అన్నారు. ఎంపి వెంట స్థానిక బీజేపీ నాయకులు వున్నారు.