ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పీజీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరహరి అన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ శనివారం నారాయణపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫుడ్ పాయిజన్ ఘటనలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.