ఉద్యోగం చేసే ప్రతి ఉద్యోగికి పదవీవిరమణ సహజమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ గురువారం పదవీవిరమణ అయ్యారు. ఈ సందర్భంగా నారాయణపేట పట్టణంలోని నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో కృష్ణ దంపతులను కలెక్టర్, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, అన్ని శాఖ జిల్లా అధికారులు, డిపివో కార్యాలయ సిబ్బంది శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.