నారాయణపేట శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయంలో కొనసాగుతున్న వేసవి ధార్మిక శిక్షణలో భాగంగా గురువారం విద్వాన్ హరీష్ ఆచార్య సంధ్యావందనం, ఋగ్వేదం, యజుర్వేదంపై శిక్షణ ఇచ్చారు. సంధ్యావందనం చేయడం ద్వారా కలిగే లాభాలు, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నరసింహ చారి, అనిల్ దేశాయి, రాఘవేంద్ర సేవాసమితి సభ్యులు శేషు, అనిరుద్ధ ఆచార్య, లక్ష్మీ సోపాన మహిళా భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.