
భారీగా పెరిగిన బంగారం ధరలు
బులియన్ మార్కెట్లో పసిడి ధరలు గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వినియోగదారులకు షాకిస్తున్నాయి. తాజాగా బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బుధవారం ఒక్కరోజు దాదాపు రూ.1650 పెరిగి ఆల్ టైం రికార్డుకు చేరుకుంది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం రూ.98,100 పలుకుతోంది. అదే విధంగా, ఇవాళ వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కిలో వెండిపై రూ.200పెరిగి రూ.1,10,000కు చేరింది.