నారాయణపేట: బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు

53చూసినవారు
నారాయణపేట: బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు
నారాయణపేట మండలం చిన్నజట్రం గ్రామంలో ఉపాధిహమీ పనులు చేస్తున్న కూలీలకు శుక్రవారం బాలల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించినట్లు చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కో ఆర్డినేటర్ నర్సింహులు తెలిపారు. పిల్లలను బాల కార్మికులుగా పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 18 ఏళ్ల లోపు బాలికలను వివాహాలు చేయరాదని, చట్టరీత్య నేరమన్నారు. బాల కార్మికులు కనిపిస్తే 1098 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్