
‘ఉద్యోగిని పథకం’.. మహిళలకు 3 లక్షల లోన్.
స్వంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకొనే మహిళలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం మహిళల స్వయం ఉపాధి కోసం 'ఉద్యోగిని' పథకాన్ని ప్రవేశపెట్టింది. 18-55 ఏళ్ల లోపు, వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల లోపు ఉన్న మహిళలు రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చు. పూర్తి వివరాలకు రేషన్, ఆధార్, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు పాస్బుక్, ఫొటోలతో స్థానిక బ్యాంకులను సంప్రదించాలి.