నారాయణపేట పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పలు విధుల్లోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వామి వారికి ఆకు పూజలు, విశేష అలంకరణలు, మహా మంగళ హారతులు చేసి నైవేద్యం సమర్పించారు. అశోక్ నగర్ లోని అభయాంజనేయ స్వామి వారి ఉత్సవ మూర్తితో పల్లకి సేవ నిర్వహించారు. వీధిలో బాజా బజంత్రీలు, భజనలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ వారు అన్నదానం చేశారు.