భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పనకు గ్రామాల్లో ఈనెల 17 నుంచి రెవిన్యూ టీంలు సందర్శించి ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరిస్తానని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ లో తహశీల్దార్, ఆర్ఐ లతో సమావేశం నిర్వహించారు. భూ భారతి చట్టాన్ని అమలు చేసేందుకు పైలెట్ ప్రాజెక్టు గ్రామం మద్దూరు కు 17న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వస్తున్నారని చెప్పారు.