నారాయణపేట: అంగరంగ వైభవంగా రథోత్సవం

56చూసినవారు
నారాయణపేట మండలం సింగారం గ్రామంలో శనివారం అర్ధరాత్రి శ్రీ చింతలరాయ స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథాన్ని రంగు రంగుల పువ్వులతో అందంగా అలంకరించి అశేష భక్తుల మధ్య ఉత్సవమూర్తులను రథంపై ఊరేగించారు. రథాన్ని లాగేందుకు యువకులు పోటీ పడ్డారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఉద్ధాల ఉత్సవం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్