నారాయణపేట జిల్లా కోస్గి మండలం పోతిరెడ్డిపల్లి నుంచి గుండాల మీదుగా సర్జఖాన్ పేట వరకు చేపట్టిన రోడ్డు పనులను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. అనంతరం పోతిరెడ్డిపల్లి నుంచి జిన్నారం వరకు 2 కిలోమీటర్ల వరకు చేపట్టిన రోడ్డు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.