

పాఠశాలలో విషప్రయోగం.. తప్పిన పెను ప్రమాదం (వీడియో)
TG: ఆదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం ధర్మపురిలోని పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు.. విద్యార్థుల తాగునీటి ట్యాంకులో, మధ్యాహ్న భోజన సామగ్రిపై పురుగుల మందు కలిపారు. పాఠశాల సిబ్బంది గమనించడంతో 30 మంది విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషప్రయోగం ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాఠశాల సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.