నారాయణపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో గురువారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలు వర్షం కారణంగా కాస్త ఉపశమనం పొందారు. ఒక్క సరిగా వర్షం పడటంతో వివిధ రకాల పనుల కొరకు బయటికి వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు వ్యవసాయానికి ఉపయోగపడతాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు.