నారాయణపేట మున్సిపాల్టీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా నియమితులైన న్యాయవాది శివరాజ్ కు గురువారం సాయంత్రం పట్టణంలోని శివలింగేశ్వర స్వామి ఆలయంలో వీరశైవ లింగాయత్, లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నాయకులు శాలువా పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మునుముందు మరిన్ని పదవులు పొందాలని చెప్పారు. కార్యక్రమంలో సమాజం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.