
ఎల్లుండి వైన్ షాపులు బంద్
తెలంగాణలో మందుబాబులకు అబ్కారీ శాఖ షాక్ ఇచ్చింది. మార్చి 14న రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు అబ్కారీ శాఖ ప్రకటించింది. శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూసి ఉండనున్నాయి. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.