భూ భారతి పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సమావేశానికి నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ హాజరయ్యారు. భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ సదస్సులను జిల్లాలోని మద్దూరు మండలాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు.