రేపు అనగా శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎం లావణ్య గురువారం ప్రకటనలో తెలిపారు. కోస్గి, నారాయణపేట డిపో పరిధిలోని ప్రయాణికులు 7382826293 నంబర్ కు ఫోన్ చేసి ఆర్టీసీ సేవలపై సలహాలు, సూచనలు, సమస్యలను చెప్పవచ్చని అన్నారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.