హైద్రాబాద్ లో నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలను ప్రభుత్వం రద్దు చేయాలని పి పీఓడబ్ల్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి డిమాండ్ చేశారు. శుక్రవారం నారాయణపేట అంబేద్కర్ భవన్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్త్రీల ఆత్మగౌరవాన్ని భంగపరిచే మిస్ వరల్డ్ పోటీలను అడ్డుకుంటామని చెప్పారు. పోటీలతో సమాజానికి చెడు సందేశం వెళ్తుందని చెప్పారు. పోటీలను రద్దు చేయాలని చెప్పారు.