తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కొత్త కార్యవర్గాన్ని కాంగ్రెస్ 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులను సోమవారం కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ కొత్త కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శులలో నారాయణపేట ఎమ్మెల్యే పర్నిక రెడ్డికి చోటు దక్కింది. ఎమ్మెల్యే పర్నిక రెడ్డి ఎంపిక పట్ల ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.