నారాయణపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీని బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. కళాశాల ఆవరణలో రూ. 26 కోట్ల వ్యయంతో నిర్మించే నర్సింగ్ కళాశాల స్థలాన్ని, రూ. 24 కోట్లతో నిర్మించే మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణాలు త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నర్సింగ్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ రామ్ కిషన్ పాల్గొన్నారు.