నారాయణపేట జిల్లాలో ఆయిల్ పామ్ తోటలను పెంచేందుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టర్ కార్యాలయంలో ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025-26 సంవత్సరంలో జిల్లాలో 3500 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు చెప్పారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ, డ్రిప్, ఆయిల్ పామ్ సాగుతో వచ్చే లాభాలు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.