నారాయణపేట నుంచి కోయిలకొండ వరకు జరుగుతున్న రెండు వరసల బిటి రోడ్డు పనులతో బండగొండ గ్రామానికి వెళ్లి మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలింది. దీంతో త్రాగునీరు వృథాగా పోతున్నాయి. గ్రామానికి నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైప్ లైన్ మరమత్తులు చేపట్టాలని, త్రాగునీటి సరఫరా పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.