నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ మహేష్ గౌడ్ తెలిపారు. ఇటీవల ఈదురు గాలులు వీస్తుండటంతో స్థానిక సివిల్ లైన్, బహార్ పేట, దన్ గడ్డ, పరిమళాపురం, యాద్గిర్ రోడ్డు, శాంతి నగర్ ప్రాంతంలో విద్యుత్ తీగల కింద ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.