ప్రజల అంచనాలకు అనుగుణంగా అధికారులు సమర్ధవంతంగా పనిచేసి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్ లో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఓ వైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరో వైపు అవసరమైన పనులు కొనసాగించి బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగడం ద్వారా జిల్లాలో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.