ఇటీవల హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలో కూచిపూడి భరతనాట్యం ప్రతిభ చూపి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించిన కోయిల కొండ మండలం కొత్లాబాద్ గ్రామానికి చెందిన జస్వితను బుధవారం నారాయణపేట సివిఆర్ భవన్ లో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు. చిరు ప్రాయంలోనే ప్రపంచ రికార్డు సాధించడం గొప్ప విషయమని కొనియాడారు.