
రాష్ట్రంలో మరో 8 కరోనా కేసులు నమోదు
AP: రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 8 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరులో నలుగురికి, ఏలూరులో ఇద్దరికి, అనంతపురం, నెల్లూరులో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో గత వారం రోజుల్లో 37 కేసులు నమోదవగా.. వారిలో నలుగురు గర్భిణులు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 86 కరోనా కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.