నారాయణపేట మండలం లింగంపల్లి గ్రామంలో వెలసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి జాతర ఉత్సవాలు మంగళవారం నుండి ప్రారంభంకానున్నాయి. ఉత్సవాల నిర్వాహకులు ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. పెద్ద బోనం అమ్మవారికి సమర్పించడంతో జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అయిదు మంగళవారాలు అమ్మవారి జాతర నిర్వహిస్తారు. జాతరకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు మహబూబ్ నగర్, హైద్రాబాద్ నుండి భక్తులు వస్తారు.