మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి నారాయణపేట జిల్లాకు మంగళవారం వస్తున్న సందర్భంగా మరికల్ మండల కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరికి గజమాలతో, భాజా భజంత్రీలతో, బాణసంచా కాలుస్తూ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.