ప్రభుత్వం అమలు చేసే పథకాలను రైతులకు చేరే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరెట్లో వ్యవసాయ శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పీఎం కిసాన్ కోసం పోర్టల్లో నమోదు చేసుకున్న రైతుల వివరాలను వెరిఫై చేయాలని, ఈ కేవైసీ చేసుకొని రైతులను గుర్తించి చేయించాలని చెప్పారు.