నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 6వ తేదీన శుక్రవారం మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మెర్సీ వసంత తెలిపారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ఉంటుందని అన్నారు. వివిధ సబ్జెక్టులలో అతిథి ఆధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ ద్రువపత్రాలతో మౌఖిక పరీక్షలకు హాజరుకావాలని కోరారు.