దామరగిద్ద మండలం కాన్ కుర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పిడిఎస్యు మధ్యన భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యూనియన్ మండల కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదని, ఇకనుండి నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. మధ్యాహ్న భోజనం కార్మికుల బిల్లులు చెల్లించాలని కోరారు.