బంగ్లాదేశ్ లో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆదివారం నారాయణపేట పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సుభాష్ రోడ్ నుండి నర్సిరెడ్డి చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. దాడులను సహించేది లేదని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం హిందువులకు హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని కోరారు.