మండల స్థాయిలో పని చేసే ఉర్దూ పత్రిక విలేకరులకు అక్రిడేషన్లు ఇవ్వాలని గురువారం నారాయణపేట కలెక్టరేట్ లో ఉర్దూ పత్రికల జిల్లా ప్రతినిధులు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ముజాహిద్దీన్ సిద్ధికి, హర్షద్ ఫైసల్, జహిరుద్దీన్, రహీం మాట్లాడుతూ. అక్రిడేషన్లు ఇవ్వాలని 239 జీఓ ను సవరించాలని రాష్ట్ర యూనియన్ నాయకులు ఇప్పటికే హై కోర్టును ఆశ్రయించామని చెప్పారు.