పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి

81చూసినవారు
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో నారాయణపేట కలెక్టరేట్ ఏవో సుజాతను కలిసి వినతి పత్రాన్ని అందించారు. భారీ వర్షాలకు పొలాల్లో నీరు నిలిచి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్ట వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కార్యదర్శి అనంతరెడ్డి కోరారు.

సంబంధిత పోస్ట్