అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత

79చూసినవారు
అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత
మరికల్ మండల కేంద్రంలో బుధవారం ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్సై మురళీ తెలిపారు. ఎరుకల మొగులయ్య ఇంట్లో రేషన్ బియ్యం నిల్వ వుంచారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మొత్తం 9. 9 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేసి రెవెన్యూ అధికారుల పంచనామా మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్