వాహనాలు పరిశీలించిన ఎస్పీ

54చూసినవారు
వాహనాలు పరిశీలించిన ఎస్పీ
వాహనాలను ఎల్లప్పుడూ కండిషన్ లో ఉంచాలని, ఎప్పటికప్పుడు మరమత్తులు చేయించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. శనివారం నారాయణపేట ఎస్పీ హెడ్ క్వార్టర్స్ లో జిల్లాలోని పోలీస్ స్టేషన్ ల వాహనాలను పరిశీలించారు. శాంతిభద్రతలు కాపాడటంలో వాహనాలు అత్యవసరమని వాటిని సొంత వాహనాలుగా భావించాలని అన్నారు. రాత్రి సమయాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. అదనపు ఎస్పీ నాగేంద్రుడు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్