అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ వార్షికోత్సవం పురస్కరించుకొని శనివారం యాదవ మహాసభ ఆధ్వర్యంలో నారాయణపేట మండలం లోకాయపల్లి వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాముడి చిత్రపటానికి పూజలు చేసి రామనామ జపం చేశారు. కార్యక్రమంలో యాదవ మహాసభ జిల్లా కన్వీనర్ రఘువీర్ యాదవ్, శశికాంత్ యాదవ్, బాలప్ప యాదవ్, నాయకులు పాల్గొన్నారు.