విద్యార్థి సంఘాలు క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని పీఓడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. శుక్రవారం నారాయణపేట మండలం కోటకొండ ప్రభుత్వ పాఠశాల మైదానంలో పీడీఎస్‌యు, పివైఎల్ పిఓడబ్యూ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి క్రీడా పోటీలను ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, శరీరం దృఢంగా మారుతుందని చెప్పారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలని కోరారు.