ప్రభుత్వం పత్తికి క్వింటాలుకు మద్దతు ధర రూ. 7, 521 నిర్ణయించిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్ లో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సిసిఐ అధికారులు, పోలీసులు అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు పత్తి కొనుగోలు చేయాలని అన్నారు. రైతులు పత్తి తేమ శాతం 12 కు మించకుండా నాణ్యమైన తేవాలని సూచించారు.