సామాజిక మధ్యమాలలో అనుచిత పోస్టులు పెడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. కుల, మత, ప్రజల భద్రత, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ఇతరుల మనోభావాలు కించపరిచేలా వాట్సాప్, పేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, తదితర సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియాపై ఐటి పోలీసుల నిరంతర నిఘా వుంటుందని చెప్పారు.