పండుగలకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం: సీఐ

73చూసినవారు
పండుగలకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం: సీఐ
మీలాద్ ఉన్ నబీ, వినాయక చవితి పండుగలను దృష్టిలో పెట్టుకొని గురువారం మరికల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మరికల్ ధన్వాడ మండలాలకు చెందిన ముస్లిం హిందూ మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించినట్లు సిఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. వినాయక మండపాల వివరాలను నిర్వాహకులు తప్పకుండా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్