విద్యార్థులు క్రమం తప్పకుండా ప్రతి రోజు పాఠశాలకు రావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం నారాయణపేట మండలంలోని కొల్లంపల్లి ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా 3వ తరగతి విద్యార్థులచే తెలుగు వాచకం చదివించారు. విద్యార్థుల లెసన్ ప్లాన్ లను పరిశీలించారు.
సిబ్బంది హాజరు రిజిస్టర్, విద్యార్థుల హాజరు శాతాన్ని చూశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.