ప్రభుత్వం రేపటి నుంచి ఈనెల 17 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యాసంస్థల్లో శుక్రవారం ముందస్తుగా సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నారాయణపేట పట్టణ శివారులోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా రంగు రంగులతో ముగ్గులను వేశారు. ఆటపాటలతో నృత్యాలు చేస్తూ, గాలి పటాలు ఎగరేస్తూ సందడి చేశారు.