మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం మండల కేంద్రాల్లో జరిగే దర్నాలు విజయవంతం చేయాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి బలరామ్ తెలిపారు. గురువారం నారాయణపేట పట్టణంలోని డీఈవో, ఏంఈఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. గత ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న కోడిగుడ్ల బిల్లులను, వేతనాలు ఇవ్వాలని అన్నారు. ఫుడ్ పాయిజన్ కారణంగా తొలగించిన కార్మికులను తిరిగి తీసుకోవాలన్నారు.